తిరుమల, సెప్టెంబర్ 19: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి మలయప్ప స్వామి ఉభయ వేదేరులతో కలిసి బాలకృష్ణుని రూపంలో సర్వ భూపాల వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. తిరుమాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మరోవైపు శ్రీవెంకటేశ్వర స్వామి వారి గరుడసేవకు టీటీడీ సన్నద్ధమైంది. అశేష సంఖ్యలో తరలివస్తున్న భక్తజనానికి సేవలందించడానికి దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు
గంగాపూర్ బాలాజీ స్వామి దేవస్తానం
Saturday, September 19, 2015
Wednesday, September 2, 2015
ఘనంగా మన గుడి కార్యాక్రమం
రెబ్బెన మండల కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాఖి పౌర్ణమి సందర్భంగా మన గుడి కార్యక్రమం కమిటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన కంకణాలు ,ప్రసాదం , కుంకుమార్చన పూజాసామాగ్రిని భక్తులకుఅందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈకార్యక్రమంలో కమిటి మెంబర్లు సుదర్శన్ గౌడ్, నవీన్ జైశ్వాల్,బొమ్మినేని శ్రీధర్, శంకరమ్మ , సోమశేఖర్, సర్పంచులు , వెంకటమ్మ, ముంజం రవీందర్, నాయకులు హన్మంతు, దుర్గారావ్, సర్వేశ్వర్ గౌడ్ , వార్డు మెంబర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Saturday, September 27, 2014
Saturday, August 30, 2014
Subscribe to:
Posts (Atom)